సింగరేణి ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

దసరా పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు శుభవార్త తెలిపింది. సంస్థకు వచ్చిన లాభాల్లో వాటాగా ప్రతి కార్మికుడికి రూ. 1,95,610 చొప్పున బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

By -  Medi Samrat
Published on : 22 Sept 2025 4:50 PM IST

సింగరేణి ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

దసరా పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు శుభవార్త తెలిపింది. సంస్థకు వచ్చిన లాభాల్లో వాటాగా ప్రతి కార్మికుడికి రూ. 1,95,610 చొప్పున బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో సుమారు 71 వేల మంది కార్మికుల కుటుంబాల్లో పండగ శోభ ముందుగానే వచ్చింది. సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో అద్భుతమైన పనితీరు కనబరిచిందని ఆయన తెలిపారు. సంస్థ మొత్తం రూ. 6,394 కోట్లు ఆర్జించగా, అన్ని ఖర్చులు పోను నికరంగా రూ. 2,360 కోట్ల లాభం వచ్చిందని తెలిపారు. ఈ లాభాల్లో 34 శాతం వాటాను కార్మికులకు బోనస్‌ రూపంలో పంపిణీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ బోనస్ పంపిణీ కోసం ప్రభుత్వం మొత్తంగా రూ. 819 కోట్లను విడుదల చేస్తుందని తెలిపారు. ఈ ప్రయోజనం సింగరేణిలోని శాశ్వత ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు కార్మికులకు కూడా వర్తిస్తుందని తెలిపారు.

Next Story