ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మరో తీపికబురు
లబ్ధిదారులకు మరో గుడ్ న్యూస్ శుభవార్త చెప్పేందుకు రెడీ అయింది.
By Knakam Karthik
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మరో తీపికబురు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా లబ్ధిదారుల ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్ల ఆధారంగా ఇందిరమ్మ యాప్‌లో లబ్ధిదారుల డీటెయిల్స్‌ను రిజిస్టర్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక అందించాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. లబ్ధిదారులకు మరో శుభవార్త చెప్పేందుకు రెడీ అయింది.
అయితే ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా మంజూరైన ఇల్లును కట్టుకునేందుకు లబ్ధిదారులకు తక్కువ ధరకే సిమెంట్ అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై సిమెంట్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కంపెనీలతో ఒప్పందం కుదిరిన తర్వాత మార్కెట్ రేటుతో పోలిస్తే తక్కువ ధరకే లబ్దిదారులకు సిమెంట్ అందజేయాలని సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రెండో విడత లబ్దిదారుల ఎంపిక ఈ నెల 30లోగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా ఈ పథకంలో భాగంగా సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఆర్థికసాయం, స్థలం లేనివారికి స్థలం కేటాయించి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.