పదవ తరగతి విద్యార్ధులకు త్వరలో విద్యాశాఖ శుభవార్త చెప్పనుంది. పరీక్ష పద్దతిలో 11 ప్రశ్నపత్రాలకు బదులు ఆరు ప్రశ్నపత్రాల విధానాన్ని అమలు చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు విద్యాశాఖ ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదనలను పంపించింది.
కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ఆన్‌లైన్ తరగతులు జరుగుతుండటంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే ఏప్రిల్-మేలో నిర్వహించే టెన్త్ పరీక్షల్లో ఆరు ప్రశ్నపత్రాల విధానాన్ని అమలు చేస్తామని ప్రతిపాదించింది. ప్రస్తుతం తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టుల్లో రెండు పేపర్ల చొప్పున ఉండగా.. హిందీ మాత్రం ఒకే పేపర్ ఉంది. ఇకపై సబ్జెక్టుకు ఒక పేపరే ప్రశ్నపత్రం ఉండేలా చర్యలు చేపట్టనుంది.