తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్‌ రెడ్డి సంక్రాంతి కానుక ప్రకటించారు. ఉద్యోగులకు మరో డీఏ ఇస్తున్నట్లు తెలిపారు.

By -  Medi Samrat
Published on : 12 Jan 2026 7:20 PM IST

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్‌ రెడ్డి సంక్రాంతి కానుక ప్రకటించారు. ఉద్యోగులకు మరో డీఏ ఇస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సచివాలయంలో మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్‌ డీఏ ఫైల్‌ మీద సంతకం చేసి వచ్చానని, రేపో మాపో డీఏ జీవో వస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పెన్షనర్లకు డీఏ,డీఆర్ పెంపు ప్రకటించింది. ఈ నిర్ణయం రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్లకు ఉపశమనం కలగనుంది. ప్రస్తుతం అమలులో ఉన్న 30.03శాతం డీఆర్‌ను 33.67శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు 2018 జూలై 1 తర్వాత రిటైర్డ్ అయిన పెన్షనర్లకు వర్తించనుంది. 2020 రివైజ్డ్ పే స్కేల్స్ ప్రకారం పెన్షన్ పొందుతున్న వారికి ప్రత్యక్ష లాభం కలిగిస్తుంది. 2018కి ముందు రిటైర్డ్ అయిన పెన్షనర్లకు కూడా డీఆర్ పెంపు వర్తించనుంది. 2015 పే స్కేల్స్ ప్రకారం పెన్షన్ పొందుతున్న వారికి డీఆర్ 68.628శాతం నుంచి 73.344శాతానికి పెరిగింది. 2016 పే స్కేల్స్ పెన్షనర్లకు డీఆర్ 42శాతం నుంచి 46శాతానికి పెంపు జరిగింది. UGC/AICTE 2006 పే స్కేల్స్ ప్రకారం పెన్షన్ పొందుతున్న వారికి డీఆర్ 221శాతం నుంచి 230శాతానికి పెరిగింది. డీఆర్ 2023 జూలై 1 నుంచి అమలులోకి వస్తుంది. 2023 జూలై నుంచి 2025 డిసెంబర్ వరకు పెరిగిన డీఆర్ బకాయిలు చెల్లించనున్నారు. ఈ బకాయిలు మొత్తం 30 నెలవారీ వాయిదాల్లో చెల్లించబడతాయి. 2026 జనవరి నెల పెన్షన్‌తో పెరిగిన డీఆర్ చెల్లింపులు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 2026లో పెన్షన్ మరియు డీఆర్ చెల్లింపులు పూర్తిగా అమలులోకి వస్తాయి. ఈ పెంపు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గ్రాంట్స్ పొందుతున్న వారికి వర్తించదు.

Next Story