తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్‌.. రేపు అకౌంట్లలో డబ్బుల జమ

రైతు రుణమాఫీ పథకంలో భాగంగా రేపు లక్ష రూపాయల లోన్‌ ఉన్న రైతుల ఖాతాల్లో సాయంత్రం 4 గంటల వరకు ప్రభుత్వం డబ్బులు జమ చేయనుంది.

By అంజి  Published on  17 July 2024 6:26 AM IST
Telangana, farmers, Loan waiver, CM Revanth

తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్‌.. రేపు అకౌంట్లలో డబ్బుల జమ

తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్‌. రైతు రుణమాఫీ పథకంలో భాగంగా రేపు లక్ష రూపాయల లోన్‌ ఉన్న రైతుల ఖాతాల్లో సాయంత్రం 4 గంటల వరకు ప్రభుత్వం డబ్బులు జమ చేయనుంది. అదే రోజు రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబురాలు జరపాలని నిర్ణయించింది. వీటికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరవుతారు. పట్టాదారు పాస్‌ పుస్తకాల ఆధారంగానే రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.

కాగా కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు అంశాన్ని పరిగణలోకి తీసుకోనున్నారు. మరోవైపు రుణ మాఫీ నిధులు పక్కదారి పట్టకుండా ముఖ్యమంత్రి.. బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రుణ మాఫీ కోసం విడుదలైన నిధులను ఇతర ఖాతాల్లో జమ చేసిన పక్షంలో బ్యాంకర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిన్న సచివాలయంలో కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సుధీర్ఘంగా జరిగిన సమావేశంలో రుణ మాఫీపై స్పష్టతనివ్వడంతో పాటు సంక్షేమ పథకాలపై సుధీర్ఘంగా వివరించారు.

Next Story