పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రూ.6 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తోంది. ఈ నిధులను ఏడాదికి మూడు విడతల్లో వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ ఏడాదికి సంబంధించిన చివరి విడత నిధులు నవంబర్ 19వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ విడతలో అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున నిధులు జమ చేయనున్నారు. ఏపీ ప్రభుత్వం కూడా రైతులకు ఆర్థిక సాయం అందిస్తూ ఉంది. ఏపీ ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేసేందుకు ఏర్పాట్లు సిద్ధం అవుతున్నాయి.
పీఎం కిసాన్ నిధులతో కలిపే అన్నదాత సుఖీభవ నిధులు కూడా రైతుల అకౌంట్లలో జమ చేస్తామని ఇదివరకే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 2019లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద, కేంద్ర ప్రభుత్వం దేశంలోని పేద రైతులకు ఏటా రూ. 6,000 అందిస్తుంది. ఈ రూ. 6,000 ఆర్థిక సహాయం ఏటా మూడు విడతలుగా విడుదల చేస్తుంది.