ఇంట్లో లక్షలు దోచుకుని.. ప్రియుడితో కలిసి పారిపోయింది.. కానీ ఆ బాలికను..

Girl elopes with boyfriend, steals Rs 6 lakh from home. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని ఒక‌ గ్రామంలో ఓ బాలిక ఇంట్లో రూ.6 లక్షలు దోచుకుని ప్రియుడితో కలిసి పారిపోయింది.

By అంజి  Published on  10 Feb 2022 6:16 PM IST
ఇంట్లో లక్షలు దోచుకుని.. ప్రియుడితో కలిసి పారిపోయింది.. కానీ ఆ బాలికను..

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని ఒక‌ గ్రామంలో ఓ బాలిక ఇంట్లో రూ.6 లక్షలు దోచుకుని ప్రియుడితో కలిసి పారిపోయింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారం వారిద్ద‌రిని పట్టుకుని నగదుతో పాటు బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక అబ్బాయితో స్నేహం చేసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే బాలుడి కోరిక మేరకు తన తండ్రి ఇంట్లో ఉంచిన రూ.6 లక్షలను ఆమె ఇంట్లో నుంచి దొంగ‌లించింది.

10 రోజుల క్రితం కుమార్తె, నగదు మాయమైనట్లు గుర్తించిన బాలిక తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోరుట్ల సీఐ రాజశేఖర్ రాజు మాట్లాడుతూ.. యువతను సన్మార్గంలో పెట్టాలని.. ప్రేమ పేరుతో జీవితాలను పాడు చేసుకోవద్దని సూచించారు. కేసును చేధించిన‌ మేడిపల్లి ఎస్‌ఐ సుధీర్‌రావు, సిబ్బంది చంద్రశేఖర్‌, భగవాన్‌, విజయ్‌లను ఆయన అభినందించారు.

Next Story