గణేష్ ఉత్సవాలు.. జీహెచ్ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు

గణేష్ ఉత్సవాల సందర్భంగా విగ్రహాల నిమజ్జనం కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో చెరువులను అందుబాటులో ఉంచారు

By Medi Samrat  Published on  6 Sep 2024 2:55 PM GMT
గణేష్ ఉత్సవాలు.. జీహెచ్ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు

గణేష్ ఉత్సవాల సందర్భంగా విగ్రహాల నిమజ్జనం కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో చెరువులను అందుబాటులో ఉంచారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా నగరవ్యాప్తంగా 73 చెరువులను సిద్ధం చేసినట్లు జీహెచ్‌ఎంసీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. వీటిలో 27 బేబీ పాండ్‌లు, 24 పోర్టబుల్ చెరువులు, 22 ఎస్కలేటర్ చెరువులు ఏర్పాటు చేశారు. వీటిలో పెద్ద విగ్రహాలు కాకుండా 2 అడుగుల నుంచి 5 అడుగుల చిన్న విగ్రహాలను నిమజ్జనం చేయవచ్చు.

పర్యావరణహిత గణపతి పూజల కోసం జీహెచ్‌ఎంసీ మట్టితో తయారు చేసిన 3.10 లక్షల విగ్రహాలను ప్రజలకు పంపిణీ చేసింది. శోభా యాత్ర కోసం రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చేందుకు ఏర్పాట్లు చేశారు. అన్ని వీధుల్లో వీధి దీపాలు వెలిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి కాటా ఆయా శాఖల అధికారులకు సూచించారు. శోభాయాత్ర సందర్భంగా ప్రతి కిలోమీటరుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ప్రధాన రహదారులపై పారిశుధ్య నిర్వహణకు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. హైదరాబాద్ గణేష్ ఉత్సవాల కోసం ముస్తాబైంది.

Next Story