ఏసీబీకి చిక్కిన అధికారులు

ఒకే రోజు న‌లుగురు న‌లుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు.

By Medi Samrat
Published on : 23 May 2025 8:44 PM IST

ఏసీబీకి చిక్కిన అధికారులు

ఒకే రోజు న‌లుగురు న‌లుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. మెదక్ జిల్లాలోని శంకరంపేట (ఎ) మండల ఇంచార్జ్ మండల పరిషత్తు అభివృద్ధి అధికారి, మండల పంచాయతీ అధికారి విఠల్ రెడ్డి ఏసీబీకి చిక్కారు. ఫిర్యాదుధారునికి సీసీ కాలువ నిర్మాణానికి సంబంధించి మంజూరయిన ఒక లక్ష తొంబై అయిదువేల ఏడువందల నలభై ఏడు వేల రూపాయల చెక్కును అందించడానికి" అధికారికంగా సహాయం చేసేందుకు అతని నుండి పదిహేను వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబ‌డ్డాడు.

సికింద్రాబాద్ ప్రాంతీయ కార్యాలయములోని సహాయక టౌన్ ప్లానర్ బి. విఠల్ రావును కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఫిర్యాదుదారునికి చెందిన రెండు భవంతులకు సంబంధించిన ఆక్యుపెన్సీ ధ్రువీకరణ పత్రాలను అందించడానికి" అధికారికంగా సహాయం చేసేందుకు ఎనిమిది లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసి, అందులో ఇప్పటికే నాలుగు లక్షల రూపాయలు తీసుకున్నాడు. మిగిలిన నాలుగు లక్షల రూపాయల కోసం డిమాండ్ చేయ‌డంతో స‌ద‌రు భ‌వ‌న య‌జ‌మాని ఏసీబీకి ఫిర్యాదుదారు చేశారు. దీంతో ఆ లంచ‌గొండి అధికారిని ఏసీబీ అరెస్ట్ చేసింది.

మ‌రో ఘ‌ట‌న‌లో ఫిర్యాదుధారునిపైన కామారెడ్డి పట్టణ రక్షకభట నిలయంలో నమోదైన ఒక కేసుకు సంబంధించి విచారణను త్వరగా పూర్తి చేసి, నిర్దోషిగా విడుదల చేయడానికి" కామారెడ్డి‌ లోని సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్ - గుగులోత్ అశోక్ శివ రామ్ నాయక్, కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ పోలీస్ కానిస్టేబుల్ నిమ్మ సంజయ్‌లు రూ.15,000/- లంచం డిమాండ్ చేసి, అభ్యర్థన మేరకు ₹10,000/- తగ్గించి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.


Next Story