కేసీఆర్ ఫామ్ హౌస్‌ను ముట్టుకుంటే ముక్కలు ముక్కలు చేస్తాం : గెల్లు శ్రీనివాస్ యాదవ్

కేసీఆర్ ఫామ్ హౌస్ పై దాడులు చేస్తామని.. నిన్న మధుయాష్కీ చేసిన వ్యాఖ్య‌ల‌ను బీఆర్ఎస్ విద్యార్ధి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఖండించారు

By Medi Samrat  Published on  29 Jan 2024 4:07 PM IST
కేసీఆర్ ఫామ్ హౌస్‌ను ముట్టుకుంటే ముక్కలు ముక్కలు చేస్తాం : గెల్లు శ్రీనివాస్ యాదవ్

కేసీఆర్ ఫామ్ హౌస్ పై దాడులు చేస్తామని.. నిన్న మధుయాష్కీ చేసిన వ్యాఖ్య‌ల‌ను బీఆర్ఎస్ విద్యార్ధి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. తెలంగాణ భవన్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా.. మాపై రోజుకో ఆరోపణ చేస్తుంద‌న్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ ను ముట్టుకుంటే.. చూస్తూ ఊరుకోమ‌న్నారు. వచ్చే ఎన్నికల్లో మీకు ప్రజలు కర్రు కాల్చి వాత పెడుతారని అన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ ను ముట్టుకుంటే ముక్కలు ముక్కలు చేస్తాం.. చీల్చి చెండాడుతాం అని హెచ్చ‌రించారు.

సీఎం కూడా లంకె బిందెలు ఉన్నాయని అనుకున్నామని గతంలో అన్నారు. పాలన మీద దృష్టి పెట్టకుండా.. మాపై విమర్శలా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎన్నికల సాకు చూపించి.. హామీల అమలు ఎగవేసే అవకాశం ఉంద‌ని అన్నారు. ఇప్పటికే 50 రోజులు గడిచింది.. మీకు ఇంకా సగం రోజులే ఉన్నాయని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికలు ఏవైనా మీకు ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు.

Next Story