విద్యాసంస్థలకు గుడ్‌న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

నాణ్యమైన విద్యను అందించేందుకు తెలంగాణలోని ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్‌ సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది

By Medi Samrat  Published on  5 Sep 2024 3:15 PM GMT
విద్యాసంస్థలకు గుడ్‌న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

నాణ్యమైన విద్యను అందించేందుకు తెలంగాణలోని ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్‌ సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రభుత్వ కార్యదర్శి డి రోనాల్డ్ రోస్ తెలిపారు. ఈ పథకం వెంటనే అమల్లోకి రానుంది. TG డిస్కమ్‌లు తెలంగాణలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల సంబంధిత విభాగాలకు లాగిన్‌లతో ఆన్‌లైన్ పోర్టల్‌ను సృష్టిస్తాయి. సంబంధిత శాఖ కార్యదర్శులు పథకంలో కవర్ చేయాల్సిన సంస్థల జాబితాను ఖరారు చేస్తారు. వాటిని ఆన్‌లైన్ పోర్టల్‌లో చేర్చుతారు. ప్రతి సంస్థకు నెలవారీ బిల్లింగ్ చేస్తారు. యూనిట్ల వినియోగం, అయిన కరెంట్ బిల్లు.. హార్డ్ కాపీ సంబంధిత సంస్థ ఇన్‌చార్జికి ఇస్తారు.

సంబంధిత పోర్టల్ లో ఆయా విద్యాసంస్థల విద్యుత్ వినియోగం, బిల్లు మొత్తం, బిల్లింగ్, చెల్లింపులు, బ్యాలెన్స్ మొదలైన వాటికి సంబంధించిన నివేదికలు ఉంటాయి. సంస్థల వారీగా, మండలాల వారీగా, జిల్లాల వారీగా అన్ని శాఖలకు ఈ చెల్లింపులకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుంది. బడ్జెట్ ప్రొవిజన్‌ని ఉపయోగించి TG డిస్కమ్‌లకు బిల్లులు చెల్లించడానికి డిపార్ట్‌మెంట్‌లను ఎనేబుల్ చేయడానికి ఆర్థిక శాఖతో పోర్టల్ అనుసంధానిస్తారు.

Next Story