రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాడిపర్తి పంచాయతీ గొల్లగూడ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. నీటి కుంటలో పడి నలుగురు పిల్లలు మృతి చెందారు. దసరా సెలవులు కావడంతో సరాదాగా చెరువులో ఈతకు వెళ్లిన పిల్లలు నీట మునిగి చనిపోయారు. విషయం తెలిసిన గ్రామస్తులు పిల్లల మృతదేహాలను బయటకుతీశారు. మృతిచెందిన పిల్లలను సుమరీన్(14), ఖలేదు(12), రెహానా(10), ఇమ్రాన్(9) గా గుర్తించారు. మృతులలో ఇద్దరు ఒక కుటుంబానికి చెందిన వారు కాగా.. మరో ఇద్దరు వేరొక కుటుంబానికి చెందినవారు. పిల్లల మరణంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా ఏడుస్తున్నారు. నలుగురి పిల్లల మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.