ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అన్నదమ్ములు దుర్మరణం

Four brothers from Akkannapet mandal killed in road accident in Maharashtra’s Aurangabad. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని ఒకే కుటుంబానికి చెందిన

By Medi Samrat  Published on  24 May 2023 6:30 PM IST
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అన్నదమ్ములు దుర్మరణం

Four brothers from Akkannapet mandal killed in road accident in Maharashtra’s Aurangabad

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అన్నదమ్ములు దుర్మరణం పాలయ్యారు. ఐదురోజుల క్రితం చౌటపల్లిలోని వారి బంధువు ఎరుకల రాములు మృతి చెందడంతో అతడి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఈ నలుగురూ తమ కుటుంబసభ్యులతో కలిసి చౌటపల్లికి వచ్చారు. కుటుంబసభ్యులను చౌటపల్లిలోనే ఉంచి అన్నదమ్ములు తిరిగి సూరత్‌కు మంగళవారం కారులో బయలుదేరారు. అదే రోజు రాత్రి మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు ఎరుకుల కృష్ణ, సంజీవ్‌, సురేష్‌, వాసుగా గుర్తించారు. అన్నదమ్ముల మరణవార్తతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Next Story