కేసీఆర్‌ను ప‌రామ‌ర్శించిన‌ మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు

బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు తుంటి ఎముక శస్త్రచికిత్స అనంతరం

By Medi Samrat
Published on : 7 Jan 2024 4:57 PM IST

కేసీఆర్‌ను ప‌రామ‌ర్శించిన‌ మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు

బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు తుంటి ఎముక శస్త్రచికిత్స అనంతరం హైదరాబాద్ నంది నగర్ లోని ఆయ‌న‌ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎన్నికలు ముగిసిన అనంతరం కేసీఆర్ బాత్రూంలో జారిపడడంతో ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. చికిత్స అనంత‌రం కోలుకుంటున్న ఆయన‌ను ప‌లువురు ప్ర‌ముఖులు ప‌రామ‌ర్శిస్తున్నారు

ఈ క్ర‌మంలోనే మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఇవాళ సతీసమేతంగా కేసీఆర్ నివాసానికి వెళ్లారు. న‌ర‌సింహ‌న్ దంప‌తులు కేసీఆర్ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా ఆరోగ్యవంతులు కావాలంటూ ఆకాంక్షించారు.

Next Story