రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్‌పై ఏసీబీ కేసు

రంగా రెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (భూ రెవెన్యూ)పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని కేసు నమోదు చేశారు

By Medi Samrat  Published on  22 Oct 2024 10:45 AM GMT
రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్‌పై ఏసీబీ కేసు

రంగా రెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (భూ రెవెన్యూ)పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని కేసు నమోదు చేశారు. ఈ కేసు నేపథ్యంలో అడిషనల్‌ కలెక్టర్‌ ఎం.వెంకట భూపాల్‌రెడ్డి, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు చేసిన ఏసీబీ.. ఆయ‌న‌ పేరున, ఆయ‌న‌ బంధువులు, బినామీల పేరిట నమోదైన రూ.5,05,71,676 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఏసీబీ గుర్తించిన ఆస్తుల వాస్తవ మార్కెట్ విలువ బహిరంగ మార్కెట్‌లో చాలా ఎక్కువగా ఉంటుందని ఏసీబీ అధికారులు తెలిపారు.

లంచం తీసుకున్న కేసులో రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.వెంకట భూపాల్ రెడ్డి, కలెక్టరేట్‌లోని ఇ సెక్షన్‌లో సీనియర్ అసిస్టెంట్ వై. మదన్ మోహన్ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఓ వ్యక్తి నుంచి మదన్‌మోహన్‌రెడ్డి 8 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ధరణి పోర్టల్‌లోని నిషేధిత జాబితా నుంచి 14 గుంటల భూమిని తొలగించేందుకు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. మదన్ మోహన్ రెడ్డి కారు నుంచి లంచం సొమ్మును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Next Story