ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు భారీ షాక్‌

మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్‌ పార్టీని వీడారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఎస్పీ అభ్యర్థి ప్రసన్నకు తన మద్దతు తెలిపారు.

By Medi Samrat  Published on  21 Feb 2025 6:43 PM IST
ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు భారీ షాక్‌

మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్‌ పార్టీని వీడారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఎస్పీ అభ్యర్థి ప్రసన్నకు తన మద్దతు తెలిపారు. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాల కారణంగా కోనప్ప కాంగ్రెస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.

కోనప్ప మార్చి 2024న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. డిసెంబర్ 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఆయన ఓడిపోయారు. సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కోనప్పపై 3088 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్ బాబు విజయం సాధించారు. లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీని వీడిన కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదిలాబాద్ జిల్లాలో కీలక నేతగా ఉన్న కోనప్ప ఏడాది పాటు కూడా కాంగ్రెస్ లో ఇమడలేకపోయారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంజూరు చేసిన ఫ్లై ఓవర్ ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో ఆయన సీఎం రేవంత్ పై ఆగ్రహంతో ఉన్నారు.

Next Story