రేపు కాంగ్రెస్‌లో చేర‌నున్న తుమ్మ‌ల..!

మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరిక దాదాపు ఖాయ‌మైంది.

By Medi Samrat  Published on  15 Sept 2023 6:56 PM IST
రేపు కాంగ్రెస్‌లో చేర‌నున్న తుమ్మ‌ల..!

మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరిక దాదాపు ఖాయ‌మైంది. రేపు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో తుమ్మల కాంగ్రెస్ లో చేర‌నున్న‌ట్లు తెలుస్తోంది. రేపు మంచి రోజు కావడంతో తుమ్మల కాంగ్రెస్ కండువా క‌ప్పుకోనున్న‌ట్లు స‌మాచారం. అయితే.. క్యాడర్ మాత్రం 17న జాయిన్ కానున్న‌ట్లు తెలుస్తోంది. పాలేరు టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ అధిష్టానం మీద అసంతృప్తిగా ఉన్న తుమ్మల కాంగ్రెస్‌లో చేరుతార‌నే ఊహాగానాలు చాల‌కాలంగా విన‌ప‌డుతున్నాయి.

ఇదిలావుంటే.. శుక్ర‌వారం కాంగ్రెస్ ముఖ్యనేతలు తుమ్మ‌లతో భేటీ అయ్యారు. హైటెక్ సిటీ మాదాపూర్ లోని మై హోమ్ భుజాలోని తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి వెళ్లిన కాంగ్రెస్ నేత‌లు ఆయ‌న‌తో భేటీ అయ్యారు. ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ కో.చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు తుమ్మ‌ల నివాసానికి వెళ్లారు. ఈ స‌మావేశంలో తుమ్మ‌ల‌ చేరిక‌పై స్ప‌ష్ట‌త వ‌చ్చిన‌ట్లు వార్త‌లు వెలువ‌డుతున్నాయి.

Next Story