పదవిని కాపాడుకునేందుకే మోడీతో రేవంత్ అంటకాగుతున్నాడు: జగదీష్ రెడ్డి
పదవిని కాపాడుకునేందుకే సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీతో అంటకాగుతున్నాడని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు.
By Knakam Karthik
పదవిని కాపాడుకునేందుకే మోడీతో రేవంత్ అంటకాగుతున్నాడు: జగదీష్ రెడ్డి
పదవిని కాపాడుకునేందుకే సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీతో అంటకాగుతున్నాడని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ అండ్ గ్యాంగ్‌కి పాలనపై పట్టు, ప్రజల పట్ల చిత్త శుద్ధి లేదని విమర్శించారు. ఎస్ఎల్‌బీసీ ఘటన పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే జరిగింది. పని చేసే వారికి ప్రమాదం అని తెలిసినా పనులు చేపట్టారు. పది రోజులు గడుస్తున్నా, పురోగతి లేదు అని విమర్శించారు. పవర్ ప్రాజెక్టులో ప్రమాదం జరిగితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వెంటనే స్పందించాం. రికవరీ వెంటనే చేపట్టి పవర్ ఉత్పత్తి చేశాం. మీ చేతగానితనం వల్ల ప్రమాదం జరిగిందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నట్లు జగదీష్ రెడ్డి మాట్లాడారు.
రాష్ట్ర మంత్రులకు శాఖలపై అవగాహన లేదు, సమీక్షలు లేవు.. సమస్యలు వస్తే పరిష్కారం చూపలేక, పక్కదారి పట్టించే మాటలు మాట్లాడుతున్నారని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రమాదం జరిగితే సీఎం, మంత్రులు సహా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఢిల్లీ పర్యటనలు చేశారు. మోడీకి కితాబు ఇస్తూ, కిషన్ రెడ్డిపై విమర్శలు చేయడం వెనుక మతలబు ఏంటని? జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. మోడీ ఇస్తానంటే కిషన్ రెడ్డి అడ్డుకోగలరా? అని సీఎం రేవంత్‌ను ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఏ ఒక్క రోజైనా అన్ని రంగాలకు 24 గంటలు విద్యుత్ ఇచ్చినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటా..అని జగదీష్ రెడ్డి ప్రభుత్వానికి సవాల్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పంటలు ఎండిపోకుండా నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, పాలన అంతా రివర్స్‌లో నడుస్తుందని జగదీష్ రెడ్డి ఆరోపించారు.