ఆ మూడు పార్టీలు కలిసి తెలంగాణపై కుట్ర చేస్తున్నాయి: హరీశ్‌రావు

బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ కలిసి తెలంగాణపై కుట్రలు చేస్తున్నాయి..అని మాజీ మంత్రి హరీశ్‌ రావు అన్నారు.

By Knakam Karthik
Published on : 26 July 2025 1:42 PM IST

Telangana, Congress Government, Cm Revanthreddy, Former Minister Harishrao

ఆ మూడు పార్టీలు కలిసి తెలంగాణపై కుట్ర చేస్తున్నాయి: హరీశ్‌రావు

బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ కలిసి తెలంగాణపై కుట్రలు చేస్తున్నాయి..అని మాజీ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఏనాడు జై తెలంగాణ అనని వ్యక్తి రేవంత్ రెడ్డి, జై డిల్లీ, జై సోనియా, జై మోదీ అంటడు. కేసీఆర్‌ను తలుచుకోకుండా రేవంత్ ప్రసంగం ఉండదు. ఉద్యమ సమయంలో రాజీనామా చేయకుండా పారిపోయింది కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి. ప్రజలు తిరగబడితే జిరాక్స్ కాపీ స్పీకర్‌కు ఇచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఉద్యమ కారులపై తుపాకీ పెట్టీ రైఫిల్ రెడ్డిగా మిగిలాడు. తెలంగాణ ద్రోహుల చరిత్ర రాస్తే బాబు పేరు మొదలు, రెండోది రేవంత్ రెడ్డి. సింహాలు చరిత్ర చెప్పనంత కాలం, వేటగాడు చెప్పిందే కథ అన్నట్లు ఉంటది. కేసీఆర్ పోరాటం, ఉద్యమం చరిత్రగా చెప్పాలి. లేదంటే అస్థిత్వంపై దెబ్బ పడుతుంది. పుస్తకాల్లో కేసీఆర్ పేరు తొలగించాడు. తెలంగాణ తల్లి విగ్రహం మార్చాడు. బతుకమ్మ తొలగించాడు. అంబేద్కర్ విగ్రహానికి ఏనాడు దండ వేయలేదు..అని సీఎం రేవంత్‌పై హరీశ్ రావు విమర్శలు చేశారు.

తెలంగాణ పోరాటం, ఉద్యమం చరిత్రను కనుమరుగు చేసే కుట్ర చేస్తున్నారు. ప్రపంచంలో ఏ పోరాటం అయినా యువతతోనే ప్రారంభం అవుతుంది. 1969 ఉద్యమం, మలి దశ, కేసీఆర్ నాయకతత్వంలో జరిగిన పోరాటంలో యువత పాత్ర కీలకం. రాజకీయాల్లో ఎంతో మంది యువతను కేసీఆర్ తెచ్చారు. యువత నుండే నాయకత్వం పుడుతుంది. కేసీఆర్ విజనరీ నాయకుడు. రాజకీయ కక్ష సాధింపు నాకు వద్దు, తెలంగాణ ప్రగతి నాకు కావాలని చెప్పిన నాయకుడు, పని చేసిన నాయకుడు కేసీఆర్. నీళ్ళు, నిధులు, నియామకాలు ఉద్యమ ట్యాగ్ లైన్. గోదావరి, కృష్ణా జలాలను బీడు భూములకు మళ్లించింది కేసీఆర్. 95 శాతం ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు దక్కేలా రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించింది కేసీఆర్. బాబుకు నీళ్ళు, రాహుల్ గాంధీకి నిధులు వెళ్తున్నాయి. నీటి దోపిడీపై కుట్రలను బద్దలు కొట్టాలి..అని హరీశ్ రావు పేర్కొన్నారు.

Next Story