రేవంత్‌తో గోవా మాజీ సీఎం దిగంబర్ కామత్ భేటీ

Former Goa CM Digambar Kamat meets Revanth. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డిని గోవా మాజీ ముఖ్యమంత్రి

By Medi Samrat  Published on  11 May 2022 6:24 PM IST
రేవంత్‌తో గోవా మాజీ సీఎం దిగంబర్ కామత్ భేటీ

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డిని గోవా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగంబర్ కామత్ బుధవారం హైదరాబాద్‌లో కలిశారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై వీరిద్దరూ చర్చించుకున్నట్లు తెలుస్తోంది. దిగంబర్ కామత్ తెలంగాణలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయడంపై టీపీపీసీ చీఫ్ రేవంత్‌కు కొన్ని సూచనలు కూడా చేసినట్లు సమాచారం.

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగంబర్ కామత్.. 2009 నుండి 2012 వరకు గోవా ముఖ్యమంత్రిగా పనిచేశారు. గోవాపై కాంగ్రెస్ నియంత్రణను కోల్పోయినప్పటికీ.. ఆయ‌న‌ నియోజకవర్గంలో గెలుపొందింది. గోవాలో అధికార బిజెపిని లక్ష్యంగా చేసుకుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై దిగంబర్ కామత్ రేవంత్ రెడ్డిని కలవడం ఇతర పార్టీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లో వ్యక్తిగత పర్యటనకు వచ్చిన దిగంబర్ కామత్.. కాంగ్రెస్ సీనియర్ నేత రేవంత్‌ని మర్యాదపూర్వకంగా కలిశారని సమాచారం.









Next Story