తెలంగాణలో మరో ఫుడ్ పాయిజన్ ఘటన..22 మంది విద్యార్థినులకు అస్వస్థత
తెలంగాణలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది.
By - Knakam Karthik |
తెలంగాణలో మరో ఫుడ్ పాయిజన్ ఘటన..22 మంది విద్యార్థినులకు అస్వస్థత
తెలంగాణలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)లో శుక్రవారం మధ్యాహ్నం భారీ ఫుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం పాఠశాలలో అల్పాహారం తిన్న కొద్దిసేపటికే విద్యార్థినులు, ఉపాధ్యాయులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మొత్తం 22 మంది విద్యార్థినులు, ముగ్గురు ఉపాధ్యాయులు వాంతులు, విరేచనాలు మరియు కడుపునొప్పితో ఇబ్బంది పడ్డారు.
అస్వస్థతకు గురైన వారందరినీ వెంటనే రేగోడ్ లోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి సలైన్ ఎక్కించి, వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. నాణ్యత లేని ఆహారం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా భోజనం సరిగా లేదని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు మండిపడుతున్నారు.
బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో మరో ఫుడ్ పాయిజన్ ఘటన అల్పాహారం తిని అస్వస్థతకు గురైన 22 మంది గురుకుల విద్యార్థులు, ముగ్గురు టీచర్లుమెదక్ జిల్లా రేగోడ్ కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో ఘటన pic.twitter.com/JJBJLRV5AC
— Mirror TV (@MirrorTvTelugu) February 20, 2026