ఎండ దెబ్బ.. చనిపోతున్న వేలాది చేపలు

వేసవి తాపంతో తెలంగాణలోని చెరువుల్లోని చేపలు చనిపోతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా పొల్కమ్మ చెరువు, కముని చెరువు సహా పలు ప్రాంతాల్లో చెరువుల్లో నీరు విపరీతంగా వేడెక్కడంతో చేపలు భారీగా చనిపోతున్నాయి

By Medi Samrat  Published on  6 May 2024 7:45 PM IST
ఎండ దెబ్బ.. చనిపోతున్న వేలాది చేపలు

వేసవి తాపంతో తెలంగాణలోని చెరువుల్లోని చేపలు చనిపోతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా పొల్కమ్మ చెరువు, కముని చెరువు సహా పలు ప్రాంతాల్లో చెరువుల్లో నీరు విపరీతంగా వేడెక్కడంతో చేపలు భారీగా చనిపోతున్నాయి. ఉష్ణోగ్రత పెరుగుదలతో ఆక్సిజన్ శాతం నీటిలో తగ్గుతూ వస్తూ ఉంది. అదే సమయంలో ఉష్ణోగ్రత పెరుగుదల జీవక్రియను పెంచుతుంది, తద్వారా ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతుంది. చాలా చెరువుల్లో ఆక్సిజన్ అందక చేపలు చనిపోతూ ఉన్నాయి. చేపలు భరించగలిగే ఉష్ణోగ్రత స్థాయి కూడా పెరిగిపోతూ ఉండడంతో చేపలు చనిపోడానికి కారణమవుతూ ఉంది.

వేసవి వేడి కారణంగా తెలంగాణలోని చెరువుల్లో చేపలు చనిపోతున్నాయి. నీటిపైన తేలియాడుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల సెల్సియస్‌ దాటిపోవడంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సరస్సుల్లోని చేపలు చనిపోతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో గరిష్టంగా 46 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లోనూ 44 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Next Story