మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. దీంతో ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగనుంది. మొదటి విడతలో 189 మండలాలకు సంబంధించి 4,235 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరుగనుంది. 56 లక్షల 19వేల 430 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనుండగా.. అందులో 27 లక్షల 41 వేల 70 పురుష ఓటర్లు.. 28 లక్షల 78 వేల 159 మంది మహిళా ఓటర్లు.. 201 ఇతర ఓటర్లు ఉన్నారు.
మొదటి విడతకు 37వేల 562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. అదే రోజు మధ్యాహ్నం కౌంటింగ్, అనంతరం ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి సాయింత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు మూతపడనున్నాయి. ఇదిలావుంటే.. మొదటి విడతలో 395 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.