సత్తుపల్లి కాంగ్రెస్‌ టికెట్ కోసం తొలి దరఖాస్తు

ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే కాంగ్రెస్ అభ్యర్థుల కోసం శుక్ర‌వారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

By Medi Samrat
Published on : 18 Aug 2023 5:14 PM IST

సత్తుపల్లి కాంగ్రెస్‌ టికెట్ కోసం తొలి దరఖాస్తు

ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే కాంగ్రెస్ అభ్యర్థుల కోసం శుక్ర‌వారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అప్లికేషన్స్ విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో సీఎల్పీ నేత భట్టి, మధుయాష్కీ, అంజన్ కుమార్ యాదవ్, ఇతర నేతలు పాల్గొన్నారు. అయితే.. తొలి దరఖాస్తు ఫారాన్ని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ స‌మ‌ర్పించారు. దరఖాస్తును పూరించి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు నిర్దేశించిన 25 వేల రూపాయల డీడీని దరఖాస్తు ఫారంతో జత చేసి.. సత్తుపల్లి ఎస్సీ నియోజకవర్గం క్రమ సంఖ్య 116కు దరఖాస్తు చేసుకున్న‌ట్లు తెలుపుతూ.. దరఖాస్తు ఫారాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కు అందించారు.

119 నియోజకవర్గాల్లో తొలి దరఖాస్తును సత్తుపల్లి ఎస్సీ నియోజకవర్గంకు చెందిన‌ మానవతారాయ్ దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు సమర్పించేటప్పుడు మానవతరాయ్ వెంటసత్తుపల్లి నియోజకవర్గ సీనియర్ నాయకులు, ఓయూ జేఏసీ నేతలు ఉన్నారు. అనంత‌రం సత్తుపల్లి కాంగ్రెస్ నాయకులు గాంధీభ‌వ‌న్‌లోనే ఉన్న‌ రేవంత్ రెడ్డిని శాలువాతో సన్మానించారు. సత్తుపల్లి నియోజకవర్గ పర్యటనకు రావాలని వారు రేవంత్ రెడ్డిని కోరారు. రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.

Next Story