మేడ్చల్‌లో ఘోర ప్రమాదం.. లారీ కిందికి దూసుకెళ్లిన బైక్‌.. ముగ్గురు దుర్మరణం

Fatal road accident in Medchal.. Three died on the spot. తెలంగాణలోని మేడ్చల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగం ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది.

By అంజి  Published on  12 Sep 2022 4:37 AM GMT
మేడ్చల్‌లో ఘోర ప్రమాదం.. లారీ కిందికి దూసుకెళ్లిన బైక్‌.. ముగ్గురు దుర్మరణం

తెలంగాణలోని మేడ్చల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగం ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. మేడ్చల్‌ పట్టణ సమీపంలో వేగంగా వెళ్తున్న ఓ బైక్‌.. ముందు వెళ్తున్న లారీని ఓవర్‌ టెక్‌ చేయబోయింది. ఈ క్రమంలోనే బైక్‌ అదుపు తప్పి లారీ కిందికి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహిళ మరో వ్యక్తి సహా... రోడ్డు దాటుతున్న వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. తీవ్రగాయాలు కావడంతో ముగ్గురూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సోమవారం తెల్లవారుజామున మేడ్చల్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం ఘటన చోటు చేసుకుంది. ప్రమాద కారణంగా నేషనల్‌ హైవేపై పెద్దసంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో పోసులు ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నది.

Next Story
Share it