పీసీసీ రేసులో నేనూ ఉన్నా : సీనియర్ నేత
Ex MLC Kanukula Janardhan Reddy. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) అధ్యక్ష పదవీ రేసులో తానూ ఉన్నానని అఖిల భారత కాంగ్రెస్
By Medi Samrat Published on
14 Jun 2021 10:33 AM GMT

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) అధ్యక్ష పదవీ రేసులో తానూ ఉన్నానని అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ్ కోశాధికారి, మాజీ ఎమ్మెల్సీ కనుకుల జనార్ధన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. గత 50 సంవత్సరాలుగా కాంగ్రెస్‌లో తాను క్రమశిక్షణ గల కార్యకర్తగా, సైనికునిగా ఉంటూ ప్రజలకు సేవలందిస్తున్నాని ఆయన పేర్కొన్నారు. తన సేవలను గుర్తించి పార్టీ అధిస్తానం తనను ఎమ్మెల్సీగా నియమించిందని ఆయన గుర్తుచేశారు.
1990వ సంవత్సరంలో నల్గొండ లోక్‌సభ నుండి పోటీచేసేందుకు పార్టీ నాయకత్వం అవకాశం కల్పించిందని ఆయన తెలిపారు. పార్టీ పటిష్టత కోసం 2005లో తాను ప్లీనరీ నిర్వహించానని.. పార్టీ కార్యకర్తలకు శిక్షణా తరగతులను ఇప్పించానని వివరించారు. తన సేవలను గుర్తించి పార్టీ అధిస్టానం పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వినతిపత్రం అందజేసినట్లు కనుకుల తెలిపారు.
Next Story