అలా నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరే..!

ప్రభుత్వం వచ్చి 10 రోజులు కూడా కాలేదు.. బీఆర్ఎస్ నేతలకు నిద్రపట్టడం లేదని.. ఓటమిని జీర్ణించుకోలేక పిచ్చిగా మాట్లాడుతున్నారని

By Medi Samrat
Published on : 19 Dec 2023 4:22 PM IST

అలా నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరే..!

ప్రభుత్వం వచ్చి 10 రోజులు కూడా కాలేదు.. బీఆర్ఎస్ నేతలకు నిద్రపట్టడం లేదని.. ఓటమిని జీర్ణించుకోలేక పిచ్చిగా మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిది కటుకం మృత్యుంజయం అన్నారు. ముఖ్యమంత్రి అసెంబ్లీ లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేస్తే.. మాకు కూడా అవకాశం ఇవ్వాలని హరీష్ రావు అంటున్నారు. 10 సంవత్సరాలుగా మీరు దోచుకున్నది ప్రజలకు కనిపిస్తుంది కాబట్టే.. ప్రజలు కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు.. మీకు అంత భయం ఎందుకు అని ప్ర‌శ్నించారు.

బీఆర్ఎస్‌ ప్రభుత్వంలో జరిగిన‌ తీవ్ర దోపిడీ.. నీటి పారుదల శాఖ, ఆర్థిక, విద్యుత్ లో జరిగిన దోపిడీ బయటపడుతుందన్నారు. నేను చాలా ముఖ్యమంత్రుల దగ్గర చేసాను.. కానీ ఇంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కరేన‌ని కొనియాడారు. ఒక్కో హామీ అమలు చేస్తుంటే ప్ర‌తిప‌క్ష నేత‌లు బెంబేలెత్తుతున్నారని అన్నారు.

ప్రపంచంలోనే అతి గొప్ప ప్రాజెక్టు అని చెప్తున్న కాళేశ్వరం ద్వారా ఎన్ని వేల ఎకరాలకు నీరు ఇచ్చారని బీఆర్ఎస్ నేత‌ల‌ను ప్ర‌శ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కాంట్రాక్టర్లకు.. కాంట్రాక్టర్ల నుండి కేసీఆర్ కుటుంబానికి వేల కోట్ల నిధులు వెళ్లాయని ఆరోపించారు. వంద ఎకరాలకు కూడా ఏ ఒక్క నియోజకవర్గంలో నీరు ఇవ్వలేదని అన్నారు. బీజేపీ అధికార మధం ఎక్కి 94 మంది పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేసి సమావేశాలు నడువుతుందన్నారు.

Next Story