మంచి డాక్టర్‌కు చూపించుకో.. సీఎం రేవంత్‌కు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కౌంటర్
రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ చేపట్టిన పాదయాత్రలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు
By Kalasani Durgapraveen Published on 12 Nov 2024 1:06 PM ISTరైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ చేపట్టిన పాదయాత్రలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన గాలికి వదిలి.. బౌబౌ అని అరుస్తున్నాడని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ను కుక్క చావు చస్తావ్ అని నోటికి వచ్చినట్లు మాట్లడుతావా ముఖ్యమంత్రి.. బంగారం లాంటి కేసిఆర్ మీద నీవు బౌబౌ అని అరుస్తున్నావ్.. మూసీ కంపు కన్న నీ నోటి కంపే ఎక్కువయింది.. నీ అన్ని అబద్ధాలు ఎవ్వడు చెప్పడని మండిపడ్డారు.. ఏదో సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది.. మంచి డాక్టర్ కి చూపించుకో అని సలహ ఇచ్చారు.
హైదరాబాద్ లో ఇళ్లు కూల గొడుతుంటే.. మా గోస తగులుతుంది అని ఆడబిడ్డలు శాపనార్థాలు పెడుతున్నారు.. అవి కనిపిస్తలేవా..? ఆ మాటలు వినబడతలేవా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే డిసెంబర్ 9న 2లక్షల రుణమాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి రైతులను నమ్మించాడు.. 2023 డిసెంబర్ పోయి 2024 డిసెంబర్ కూడా వస్తుంది.. అరకొర రుణమాఫీ మాత్రమే జరిగింది.. చారాణా రుణమాఫీ చేసి బారాణ రుణమాఫీ జరిగినట్లు ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు.
రైతు బంధు కేసీఆర్ 10వేలు ఇస్తున్నాడు.. కాంగ్రెస్ వస్తే రైతు భరోసా కింద ఎకరానికి 15వేలు ఇస్తా అన్నడు.. ఆల్రెడీ ఒక సీజన్ ఎగొట్టిండు.. కేసీఆర్ కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా రైతులను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నడు.. 7 సీజన్లు, 72వేల కోట్లు రైతులకు రైతు బంధు కింద ఇచ్చాడు.. మీరు ఇస్తానన్న రైతు భరోసా ఏదీ..? అని ప్రశ్నించారు.
రైతులకు వడ్లకు 500 రూ. బోనస్ ఇస్తా అన్నావ్.. ఇప్పుడు సన్న వడ్లకు అని అంటున్నావ్.. రైతులను మోసం చేస్తున్నావ్.. రైతులకు ఇచ్చిన హామీలు చేతకాక కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావ్ అని ఫైర్ అయ్యారు.
జగిత్యాల జిల్లా అధ్యక్షుడు మా విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని పాదయాత్ర చేయడాన్ని అభినందించారు. రైతులకు మద్దతుగా యువ నాయకుడు సంజయ్ చేపట్టిన పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా పాద యాత్రలకు శ్రీకారం చుట్టనుందన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పాదయాత్రలు చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదిస్తారన్నారు.
నీ మూసీ పాదయాత్రలో మూసీ బాధిత రైతులు, కుటుంబాలు లేవు.. వేరే దగ్గరి నుండి మనుషులను తెప్పించుకున్నావ్.. కానీ కోరుట్ల రైతుల పాదయాత్రలో పెద్ద ఎత్తున రైతులు స్వచ్ఛందంగా తరలి వచ్చారన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు 2 లక్షల రుణమాఫీ, ఎకరానికి 15వేలు రైతు భరోసా, వడ్లకు 500 రూ. బోనస్ చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన డిమాండ్ చేస్తూనే ఉంటుంది.. మీ మోసాలను ప్రజా క్షేత్రంలో ఎండగడుతూనే ఉంటామన్నారు.