పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి : మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్

పవన్ కళ్యాణ్ ఏపీకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్.. ఒక సినిమా యాక్ట‌ర్ కాదు.. ఒక‌ప్ప‌టిలా డైలాగులు చెప్ప‌డం క‌రెక్ట్ కాద‌ని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

By -  Medi Samrat
Published on : 3 Dec 2025 5:35 PM IST

పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి : మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్

పవన్ కళ్యాణ్ ఏపీకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్.. ఒక సినిమా యాక్ట‌ర్ కాదు.. ఒక‌ప్ప‌టిలా డైలాగులు చెప్ప‌డం క‌రెక్ట్ కాద‌ని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అభిమానం వేరు, ఆత్మ గౌరవం వేరు.. తెలంగాణకు గొప్ప చరిత్ర ఉందన్నారు. తెల‌గాణ ప్రత్యేక సంస్థానంగా ఉన్నప్పుడే 11 దేశాల్లో రాయబార కార్యాలయాలు ఉన్నాయన్నారు. గతంలో సినిమా హీరోగా ఉన్నప్పుడు డైలాగులు రాస్తే వాటిని మాట్లాడేవారు.. ఇప్పుడు అలా మాట్లాడ‌టం క‌రెక్ట్ కాద‌న్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరూ మంచి సినిమా నటులు అని కితాబిచ్చారు.

వైరల్ ఫీవర్ వస్తే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చారు.. పవన్ కళ్యాణ్‌కు దగ్గు వచ్చినా హైదరాబాద్‌కు రావాల్సిందేన‌న్నారు. తెలంగాణ వాళ్ళ కళ్ళు మంచిగా లేవని పవన్ కళ్యాణ్ మాట్లాడటం మంచిది కాదన్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పి పుల్ స్టాప్ పెట్టాలన్నారు. రాజకీయాల్లో ఉన్నత పదవుల్లో ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాలన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై స్పందిస్తూ.. సీఎం పక్కన కాళ్ళల్లో కట్టే పెట్టే వాళ్ళు ఉన్నారని విమ‌ర్శించారు.. దేవుళ్ళ గురించి మాట్లాడిన వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌ట్టారు. దేశంలో హిందువులు ఎక్కువగా వుంటారు.. హిందు దేవుళ్ళ గురించి సీఎం మాట్లాడటం మంచిది కాదన్నారు.

Next Story