ప్రజా పాలన అంటే ఇదేనా.. రేవంత్ రెడ్డి.? : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

కానిస్టేబుల్స్ కుటుంబాలు రోడ్డు మీదకు రావటానికి సీఎం రేవంత్ కారణమ‌ని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  26 Oct 2024 2:15 PM GMT
ప్రజా పాలన అంటే ఇదేనా.. రేవంత్ రెడ్డి.? : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

కానిస్టేబుల్స్ కుటుంబాలు రోడ్డు మీదకు రావటానికి సీఎం రేవంత్ కారణమ‌ని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. హోంశాఖ నిర్వహిస్తోన్న రేవంత్ ఫెయిల్ అవ్వటం వలనే పోలీస్ కుటుంబాలు బయటకు వచ్చాయన్నారు. రక్షకభటులే న్యాయం కావాలని రోడ్డు ఎక్కటం బాధాకరం అన్నారు. పోలీసులు రోడ్డు ఎక్కటం చరిత్రలోనే మెదటసారి.. ప్రజా పాలన అంటే.. ఇదేనా రేవంత్ రెడ్డి.? అని ధ్వ‌జ‌మెత్తారు.

హోంమంత్రి లేకపోవటం వల‌న.. కానిస్టేబుల్స్ బాధ ఎవరకి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెల‌కొంద‌ని అన్నారు. యూనిఫాం వేసుకుని ధ‌ర్నాలు చేయాల్సిన పరిస్థితి తెలంగాణలో వచ్చిందన్నారు. అయినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడం బాధాకరం అన్నారు.

ఏక్ పోలీస్ వ్యవస్థపై సీఎం రేవంత్ మాటను నిలబెట్టుకోవాలన్నారు. 18 రోజులకు‌.. 4రోజులు కుటుంబంతో గడిపే పాత పద్దతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. పిల్లలు కూడా తండ్రులను గుర్తుపట్టని పరిస్థితులు పోలీస్ కుటుంబాలవి అని అన్నారు. మహిళలపై అఘాయిత్యాలు రాష్ట్రంలో సర్వసాధారణంగా మారాయి. డీజీపీ స్థాయి అధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు.

Next Story