కాంగ్రెస్ వాళ్ళను ఉరికించి కొడతాం : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
కాంగ్రెస్ వాళ్లు దద్దమ్మలు.. అందుకే సాగర్ ప్రాజెక్టును కేంద్రానికి అప్పజెప్పారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 5 Feb 2024 3:40 PM ISTకాంగ్రెస్ వాళ్లు దద్దమ్మలు.. అందుకే సాగర్ ప్రాజెక్టును కేంద్రానికి అప్పజెప్పారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ BRS మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ వస్తున్నారు అనగానే కాంగ్రెస్ వాళ్ళ లాగులు తడుస్తున్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వాళ్ళకు అహంకారం పెరిగిందన్నారు. రైతు బంధు నిలిపివేశారు.. రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతాం అంటున్నారు కాంగ్రెస్ వాళ్లు. ప్రాజెక్టులను KRMB కి అప్పజెప్పి దొంగ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. 9 సంవత్సరాలు అయినా నది జలాలు పంపిణీ చేసే తీరిక కేంద్రానికి లేదు.. అలాంటి కేంద్రం సాగర్ నుండి మనకు మంచి నీరు కావాలంటే తొందరగా ఇస్తదా అని ఆలోచన చేయాలన్నారు.
ప్రాజెక్టులను KRMB కి ఇవ్వడం అంటే ఆంధ్రకు నీళ్లు అప్పనంగా రాసి ఇవ్వడమేనన్నారు. అప్పట్లో చంద్రబాబు సాగర్ డ్యామ్ పై హుషారు చేస్తే కేసీఆర్ గారు తరిమికొట్టారని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాల్ల చేతకానితనం వల్ల సాగర్ మన చేతుల్లోంచి వెళ్ళిపోయిందన్నారు. కాంగ్రెస్ వాళ్లు చేసిన నిర్వాకం వల్ల ఈ దుస్థితి వచ్చింది. కోమటిరెడ్డి లాంటోడు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ అపుతా అంటున్న కోమటిరెడ్డిని చెప్పులతో కొడతారన్నారు. కాంగ్రెస్ వాళ్లకు చిత్తశుద్ధి ఉంటే రేపటి వరకు సాగర్ ప్రాజెక్టును మన పరిధిలోకి తీసుకురావాలని అన్నారు.
తెలంగాణకు శ్రీ రామరక్ష కేసీఆర్ మాత్రమేనన్నారు. సాగర్ నీళ్ల కోసం కేసీఆర్ పోరాటం మొదలు పెడుతున్నారని.. కాంగ్రెస్ వాళ్ళను ఉరికించి కొడతామన్నారు. మన కళ్ల ముందే సాగర్ నీళ్లు పోతుంటే రైతుల కడుపు రగులుతోందన్నారు. కాంగ్రెస్ సీఎం, క్యాబినెట్ అంతా రండనే.. కేసీఆర్ పై ఎదురుదాడి చేసి తప్పించుకోవాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎడమ కాల్వ రైతాంగం మళ్ళీ తిరోగమనం అయ్యేలా పరిస్థితి వచ్చింది. సాగర్ డ్యామ్ కేంద్ర బలగాల చేతికి పోయిందన్నారు. మనలను అడుగు కూడా పెట్టనియ్యడం లేదు.. ఇది కాంగ్రెస్ వాళ్లు చేసిన నిర్వాకం అన్నారు. కాంగ్రెస్ వాల్ల తెలివితక్కువ తనం వల్లనే కృష్ణా నీళ్లు తరలిపోయాయన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ వాళ్లు పాలన చేస్తున్నారు. చంద్రబాబు బూట్లు నాకేటోళ్లు కాంగ్రెస్ వాళ్లు అని విమర్శించారు. రేవంత్ చంద్రబాబు శిష్యుడు.. అందుకే ఈ దుస్థితి వచ్చిందన్నారు. ఇక యుద్ధం మొదలుపెడదాం.. కాంగ్రెస్ వాళ్లను తరిమికొడదామని పిలుపునిచ్చారు.