త్వరలోనే ప్రజల మధ్యకు రాబోతున్న కేసీఆర్

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలోనే ప్రజల మధ్యకు రాబోతున్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడై ప్రజల మధ్యలోకి వస్తారని

By Medi Samrat  Published on  6 Jan 2024 6:30 PM IST
త్వరలోనే ప్రజల మధ్యకు రాబోతున్న కేసీఆర్

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలోనే ప్రజల మధ్యకు రాబోతున్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడై ప్రజల మధ్యలోకి వస్తారని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఫిబ్రవరి నెలలో తెలంగాణ భవన్‌కి వచ్చి ప్రతి రోజూ కార్యకర్తలను కలుస్తారని.. త్వరలోనే కేసీఆర్ జిల్లాల పర్యటనలు కూడా ఉంటాయని హరీశ్ రావు తెలిపారు. హైదరాబాద్‌లో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేసీఆర్ కోలుకుంటున్నారని.. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల మధ్యలోకి వస్తారని హరీశ్ రావు తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వ తీరును చూస్తుంటే ఏడాది లోపే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదనిపిస్తోందని హరీష్ రావు జోస్యం చెప్పారు. కేసీఆర్ కిట్లపై కేసీఆర్ బొమ్మను తొలగించినా, ప్రజల గుండెల నుంచి కేసీఆర్ ను తొలగించలేరని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపులకు దిగితే ఎమ్మెల్యేలంతా బాధితుల వద్దకు వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీస్తామని.. ఎన్నికల్లో ఓటమి స్పీడ్ బ్రేకర్ వంటిదని, ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ మన సత్తా ఏమిటో చూపిద్దామని అన్నారు.

Next Story