విక్రమ్ గౌడ్‌తో ఈటెల రాజేందర్ భేటీ

Etela Rajender meets Vikram Goud. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు, బీజేపీ యువ నాయకుడు విక్రమ్ గౌడ్‌తో బీజేపీ ఎన్నికల నిర్వహణ

By Medi Samrat  Published on  21 July 2023 7:14 PM IST
విక్రమ్ గౌడ్‌తో ఈటెల రాజేందర్ భేటీ

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు, బీజేపీ యువ నాయకుడు విక్రమ్ గౌడ్‌తో బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ భేటీ అయ్యారు. ఏంజె మార్కెట్ లోని విక్రమ్ గౌడ్ నివాసంలో ఈ భేటీ జ‌రిగింది. విక్రమ్ గౌడ్ భోజనం చేసిన ఈటెల.. గోషామహల్ నియోజకవర్గంలో తాజా రాజకీయాలపై చర్చించారు. మొన్న రాజాసింగ్ ను.. నేడు విక్రమ్ గౌడ్ ని కలవడంపై గోషామహల్ లో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

భేటీ అనంత‌రం విక్రమ్ గౌడ్ మాట్లాడుతూ.. గోషామహల్ సీటు నాదేన‌ని అన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ నుండే గోషామహల్ నియోజకవర్గంలో పోటీ చేస్తానని స్ప‌ష్టం చేశారు. రాజాసింగ్ ఇంటికి వెళ్లి ఆయన మద్దతు కూడా కోరుతానని వెల్ల‌డించారు. నా కుటుంబానికి గోషామహల్ నియోజకవర్గ ప్రజలతో 40 ఏళ్ల అనుబంధం ఉందని తెలిపారు. రాజాసింగ్ సస్పెన్షన్ బీజేపీ కేంద్ర అధిష్టానం పరిధిలో ఉందని వెల్ల‌డించారు. ఆయన సేవలు కూడా పార్టీకి అవసరం కాబట్టి ఆ దిశగా అధిష్టానం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. రాజాసింగ్‌కు త‌గిన గౌర‌వం ద‌క్కుతుంద‌ని అన్నారు.


Next Story