బీజేపీలో చేరిన ఈటల రాజేందర్‌

Etela Rajender joined BJP.తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేంద‌ర్ సోమ‌వారం బీజేపీ కండువా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Jun 2021 12:22 PM IST
బీజేపీలో చేరిన ఈటల రాజేందర్‌

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేంద‌ర్ సోమ‌వారం బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇటీవ‌ల టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పిన ఆయ‌న ఈ ఉద‌యం ఢిల్లీకి వెళ్లి కేంద్ర‌మంత్రి ధ‌ర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర పార్టీ వ్య‌వ‌హారాల ఇన్‌చార్జ్ త‌రుణ్‌చుగ్ స‌మక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈట‌ల‌తో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు ర‌వీంద‌ర్‌రెడ్డి, మాజీ జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ తుల ఉమ‌, ఆర్టీసీ కార్మిక నేత అశ్వ‌త్థామ‌రెడ్డి తో పాటు ప‌లువురు నాయ‌కులు బీజేపీలో చేరారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపురావు, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎమ్మెల్యే రఘునందన్ రావు, మురళీధర్ రావు తదితర బీజేపీ నేతలు పాల్గొన్నారు. మ‌రికాసేప‌ట్లో ఈట‌ల బృందం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇంటికి వెళ్ల‌నుంది.

భూకబ్జా ఆరోపణల కారణంగా ఈటలను ఇటీవల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేసింది. అనంతరం పార్టీ, ఎమ్మెల్యే పదవులకు ఆయన రాజీనామా చేశారు. దీంతో హుజూరాబాద్‌ నియోజకవర్గం ఉప ఎన్నిక అనివార్యం అయింది.

Next Story