ఢిల్లీకి వెళ్లిన ఈటెల‌.. అందుకేనా..?

Etela Rajendar Delhi Tour. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఢిల్లీ బయలుదేరి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న‌ సోమవారం బీజేపీ అగ్రనేతలతో

By Medi Samrat
Published on : 30 May 2021 7:20 PM IST

ఢిల్లీకి వెళ్లిన ఈటెల‌.. అందుకేనా..?

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఢిల్లీ బయలుదేరి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న‌ సోమవారం బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యే అవకాశం ఉందని క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఈటల వెంట ఏనుగు రవీందర్ రెడ్డి, బీజేపీ నేత వివేక్ కూడా ఢిల్లీకి వెళ్లిన‌ట్లు స‌మాచారం. ఈటెల బీజేపీలో చేర‌నున్నార‌ని.. ఈ నేఫ‌థ్యంలో రేపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర హోం శాఖ సహాయ కిషన్‌రెడ్డి ఢిల్లీ వెళ్తారనే ప్రచారం జరుగుతోంది.

ఇదిలావుంటే.. భూ కబ్జా ఆరోపణలు రావడంతో మంత్రి పదవి నుంచి ఈటలను సీఎం కేసీఆర్ బర్తరఫ్ చేశారు. అప్పటినుంచి ఈటల ఏ పార్టీలో చేర‌నున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఈటెల‌కు బీజేపీ, కాంగ్రెస్ నేతల నుండి ఆహ్వానాలు కూడా వ‌చ్చాయి. అయితే ఈటెల మాత్రం బీజేపీ నేతలతో మంతనాలు జరిపారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని తాను కలిసింది నిజమేనని ఈటల రాజేందర్‌ అంగీకరించారు. కిషన్‌రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌నీ వేర్వేరు సంద‌ర్భాల్లో కలిసినట్లు తెలిపారు.


Next Story