హైదరాబాద్‌లో ఫాల్కన్ కంపెనీ రూ.1700 కోట్ల స్కామ్..రంగంలోకి ఈడీ
హైదరాబాద్ కేంద్రంగా వెలుగు చూసిన ఫాల్కన్ స్కామ్ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది.
By Knakam Karthik Published on 22 Feb 2025 12:51 PM IST
హైదరాబాద్‌లో ఫాల్కన్ కంపెనీ రూ.1700 కోట్ల స్కామ్..రంగంలోకి ఈడీ
హైదరాబాద్ కేంద్రంగా వెలుగు చూసిన ఫాల్కన్ స్కామ్ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. రూ.170o కోట్లు కొల్లగొట్టి కుచ్చుటోపీ పెట్టిన ఫాల్కన్ కంపెనీపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు స్టార్ట్ చేసింది. ఒక్క హైదరాబాద్‌లో రూ.850 కోట్లు వసూలు చేసినట్లు ఐడెంటిఫై చేశారు. పెట్టుబడి దారుల నుంచి వసూలు చేసిన డబ్బులను విదేశాలను మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. తక్కువ మొత్తానికి ఎక్కువ లాభాలు ఇస్తామంటూ ఫాల్కన్ కంపెనీ ప్రచారం చేసిన అమాయకుల నుంచి కోట్ల రూపాయలు కాజేసింది. పెట్టుబడులను ప్రముఖ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి వచ్చిన లాభాన్ని పంచుతామని ప్రచారం చేసింది. కాగా వచ్చిన డబ్బును 22 షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. దుబాయ్, మలేషియా, సింగపూర్ వంటి దేశాలకు డబ్బులను పంపించినట్లు ఈడీ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. విదేశాలకు పారిపోయిన నిందితుల కోసం ఎల్‌ఓసీని కూడా సైబరాబాద్ పోలీసులు జారీ చేశారు.
ఈ క్రమంలోనే ఫాల్కన్ కంపెనీ మోసాలు బయటికి వస్తున్నాయి. ఈ కేసులో మొత్తం 19 మందిపై అధికారులు కేసులు నమోదు చేశారు. ఫాల్కన్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వైస్ ఛైర్మన్ పవన్ కుమార్, డైరెక్టర్ కావ్య, ఎగ్జిక్యూటివ్ మేనేజర్ అనంతను అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులైన ఫాల్కన్ డైరెక్టర్ అమర్‌దీప్ కుమార్, సీఏవో ఆర్యన్ సింగ్, సీఈవో యోగేందర్ సింగ్ దుబాయక్‌కు పరారైనట్లు తెలుస్తోంది. విచారణలో భాగంగా విదేశాల్లో ఉన్న ఫాల్కన్ షెల్ కంపెనీలకు క్రిప్టో కరెన్సీ, హవాలా రూపంలో మళ్లించిన నిధుల వివరాలను ఈడీ అధికారులు సేకరిస్తున్నారు.
కాగా.. ఇన్‌వాయిస్ డిస్కౌంట్స్ ఆఫర్ పేరిట నాలుగు సంవత్సరాలుగా ఫాల్కన్ క్యాపిటల్స్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో పెట్టుబడిదారుల నుంచి రూ.1,700 కోట్లు వసూలు చేసినట్లు ఇప్పటికే తేలింది. అయితే..తమ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే సంవత్సరానికి 11 నుంచి 22 శాతం రిటర్న్స్ ఇస్తామని అందరికీ మాయమాటలు చెప్పి.. నమ్మించి.. నట్టేట ముంచేశారు.