తెలంగాణలో ఆ 9 పార్టీలు రద్దు

నామ మాత్రంగా ఉన్న పార్టీలను ఎన్నికల సంఘం రద్దు చేస్తూ వస్తోంది.

By -  Medi Samrat
Published on : 20 Sept 2025 7:05 PM IST

తెలంగాణలో ఆ 9 పార్టీలు రద్దు

నామ మాత్రంగా ఉన్న పార్టీలను ఎన్నికల సంఘం రద్దు చేస్తూ వస్తోంది. ఇక తెలంగాణలో 9 రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం రద్దు చేసింది. రాష్ట్రంలో నమోదైన 9 గుర్తింపు లేని రాజకీయ పార్టీలను రద్దు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి తెలిపారు. చట్టపరమైన నిబంధనలు పాటించకపోవడంతో డీలిస్టింగ్‌ చేసినట్లు తెలిపారు. ఆల్‌ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీ, ఆల్‌ ఇండియా బీసీ ఓబీసీ పార్టీ, బీసీ భారత దేశం పార్టీ, భారత్ లేబర్ ప్రజా పార్టీ, లోక్ సత్తా పార్టీ, మహాజన మండలి పార్టీ, నవభారత్ నేషనల్ పార్టీ, తెలంగాణ ప్రగతి సమితి, తెలంగాణ ఇండిపెండెంట్ పార్టీలను రద్దు చేశారు.

రద్దయిన పార్టీలలో నాలుగు పార్టీలు హైదరాబాద్‌కు, మరో నాలుగు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాకు, ఒకటి భద్రాద్రి–కొత్తగూడెం జిల్లాకు చెందినది. ఈ పార్టీలన్నీ నమోదు అయినప్పటికీ గుర్తింపు పొందలేదని, ప్రజాస్వామ్య ప్రతినిధుల చట్టం–1951 ప్రకారం తప్పనిసరి నివేదికలు, లెక్కలు సమర్పించకపోవడంతో ఎన్నికల సంఘం వాటిని రద్దు చేసింది.

Next Story