Big Breaking: కేసీఆర్‌ ప్రచారంపై 48 గంటల నిషేధం

మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. 48 గంటలపాటు ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధం విధించింది.

By అంజి  Published on  1 May 2024 7:04 PM IST
Election Commission, BRS, KCR, Telangana

Big Breaking: కేసీఆర్‌ ప్రచారంపై 48 గంటల నిషేధం

మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. 48 గంటలపాటు ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. కాంగ్రెస్‌ నాయకులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు అందడంతో ఎన్నికల కమిషన్‌ ఈ నిర్ణయం తీసుకుంది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 48 గంటలపాటు ఈ నిషేధం వర్తించనుంది.

సిరిసిల్లలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా "అవమానకరమైన, అభ్యంతరకరమైన ప్రకటనలు" చేసినందుకు.. ఈరోజు రాత్రి 8:00 గంటల నుండి 48 గంటల పాటు ఏదైనా బహిరంగ సభలు, బహిరంగ ఊరేగింపులు, బహిరంగ ర్యాలీలు, షోలు, ఇంటర్వ్యూలు, మీడియాలో (ఎలక్ట్రానిక్, ప్రింట్, సోషల్ మీడియా) బహిరంగ ప్రసంగాలు చేయకుండా కేసీఆర్‌పై ఈసీ నిషేధం విధించింది.

Next Story