వృద్ధుడిని స్తంభానికి కట్టేసి కొట్టి చంపారు

Elderly man tied to pole, thrashed to death by family members in Odisha’s Koraput. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా గిరిజన ప్రాంతంలో పట్టపగలు ఓ వృద్ధుడిని కుటుంబ సభ్యులు

By Medi Samrat  Published on  8 Aug 2022 1:50 PM IST
వృద్ధుడిని స్తంభానికి కట్టేసి కొట్టి చంపారు

ఒడిశాలోని కోరాపుట్ జిల్లా గిరిజన ప్రాంతంలో పట్టపగలు ఓ వృద్ధుడిని కుటుంబ సభ్యులు విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టి చంపారు. మృతుడిని 'కుర్షా మానియాకా' అని గుర్తించారు. వ్యక్తిగత వివాదం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది. తన కుమారుడి ఇంటి కప్పు పైన ఉంచిన ఆస్బెస్టాస్ షీట్‌ను అతడు పగలగొట్టాడు. దీంతో అతని కుటుంబ సభ్యులతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. మానియాక సోదరుడు, కొడుకు, కోడలు అతన్ని విద్యుత్ స్తంభానికి కట్టివేసి.. కర్రలతో దాడి చేశారు. ఒక మహిళ, యువకుడు వృద్ధుడిని నిర్దాక్షిణ్యంగా కొట్టినట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి.

తనను తాను రక్షించుకోలేక మానియాకా బాధతో కేకలు వేయడం చూడవచ్చు. ఈ దాడిలో వృద్ధుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం స్థానికుల సాయంతో నిందితులు మృతదేహాన్ని దహనం చేశారు. ఈ ఘటనపై కొందరు గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం ఓ వ్యక్తిని పట్టుకుంది. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. తదుపరి విచారణ జరుగుతోందని, పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను పట్టుకోవడం కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు.




Next Story