వరంగల్‌లో భూకంపం.. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 3.6గా నమోదు

తెలంగాణలోని వరంగల్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఎన్‌సిఎస్ తెలిపింది.

By అంజి  Published on  25 Aug 2023 2:42 AM GMT
earthquake, warangal, Telangana

వరంగల్‌లో భూకంపం.. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 3.6గా నమోదు

తెలంగాణలోని వరంగల్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. నేషనల్‌ సెంటర్‌ సిస్మోలజీ ప్రకారం,.. భూకంపం భూ అంతర్భాగంలో 30 కిలోమీటర్ల లోతులో నమోదైంది. ''భూకంపం తీవ్రత: 3.6, 25-08-2023న సంభవించింది'' ఎన్‌సీఎస్‌ ఎక్స్‌లో తెలిపింది. ఎన్‌సీఎస్‌ రిపోర్ట్‌ ప్రకారం.. ఉదయం 4:43 గంటలకు భూకంపం సంభవించింది. భూకంపంతో వరంగల్‌ పరిసర ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

వేకువ జామున భూమి ఒక్కసారిగా కంపించడంతో చాలా మంది బయపడిపోయారు. నిద్రలో ఉన్న వారు ఒక్కసారిగా ఉలికిపడి లేచారు. అయితే భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం అందలేదని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూకంపం సంభవించింది. జిల్లాలోని మణుగూరులో శనివారం సాయంత్రం ఒక్కసారిగా ప్రకంపనలు వచ్చాయి. దాదాపు రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో ఏం జరుగుతుందో తెలియక జనం ఆందోళనకు గురయ్యారు.

భూకంపం సమయంలో ఏమి చేయాలి?

- భూకంపం సమయంలో భయాందోళనలకు దారితీస్తుంది. కాబట్టి ప్రశాంతంగా ఉండండి

- గాయపడకుండా ఉండటానికి కిటికీలు, బయటి గోడల నుండి దూరంగా ఉండండి.

- బయట ఉంటే, భవనాలు, చెట్లు మొదలైన వాటికి దూరంగా బహిరంగ ప్రదేశానికి వెళ్లడానికి ప్రయత్నించండి.

- ఇంటి లోపల ఉంటే, ఒక దృఢమైన ఫర్నిచర్‌ను పట్టుకుని వణుకు ఆగే వరకు పట్టుకోండి.

Next Story