సూర్యాపేట జిల్లాలో భూప్రకంపనలు సంభవించాయి. ఒక్కసారిగా భూమి 10 సెకన్లపాటు కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. కృష్ణానది తీర ప్రాంతంలోని చింతలపాలెం, మేళ్లచెరువు, హుజూర్‌నగర్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 3.0 తీవ్రతగా నమోదైంది. భూకంప తీవ్రత స్పల్పంగా ఉండటం.. ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరక్కపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
ఇదిలావుంటే.. ఏపీలోని పులిచింతల ప్రాజెక్టు వద్ద కూడా ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మాదిపాడులోని జడేపల్లి తండా, కంచిబోడు తండాల్లో భూకంపం వచ్చింది. ఆదివారం ఉదయం స్వల్వ వ్యవధిలో భారీ శబ్ధంతో రెండుసార్లు భూమి కంపించిందని స్థానికులు వెల్లడించారు.