డీఎస్సీ పరీక్ష వాయిదా
తెలంగాణలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ) పరీక్ష వాయిదా పడింది.
By Medi Samrat
తెలంగాణలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ) పరీక్ష వాయిదా పడింది. నవంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నవంబరు 20 నుంచి 30 వరకు టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్(టీఆర్‌టీ) పరీక్ష నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించారు. నవంబర్ 30న ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో టీఆర్‌టీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా డీఎస్సీ వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన తెలిపారు. నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు జరగాల్సిన స్కూల్ అసిస్టెంట్, ఫిజికల్ ఎడ్యుకేషన్, భాషా పండిట్లు, ఎస్జీటీ పరీక్షలు వాయిదా పడ్డాయి. నవంబర్ 30వ తేదీన పోలింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో ఎస్‌జీటీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.