తాను మరణించినా ఐదుగురికి ప్రాణం పోసిన డాక్టరమ్మ
ప్రమాదంలో తాను మరణించినా.. ఐదుగురికి జీవితాన్ని పోసింది ఆ వైద్యురాలు
By Knakam Karthik
తాను మరణించినా ఐదుగురికి ప్రాణం పోసిన డాక్టరమ్మ
ప్రమాదంలో తాను మరణించినా.. ఐదుగురికి జీవితాన్ని పోసింది ఆ వైద్యురాలు. కన్న కుమార్తెను కోల్పోయిన దుఃఖంలోనూ అవయవాలు దానం చేసేందుకు ఆ కుటుంబం ముందుకు వచ్చింది. వివరాల్లోకి వెళితే..హైదరాబాద్ కామినేని హాస్పిటల్‌లో హౌజ్ సర్జన్‌గా పని చేస్తోన్న భూమిక తన ఫ్రెండ్ యశ్వంత్‌తో కలిసి ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా నార్సింగి పీఎస్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ప్రమాదంలో యశ్వంత్ స్పాట్‌లోనే చనిపోగా.. హాస్పిటల్‌లో వారం రోజుల పాటు చికిత్స పొందుతూ భూమిక బ్రెయిన్ డెడ్ అయ్యారు. కుమార్తె మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయినప్పటికీ భూమిక అవయవాలు డొనేట్ చేసుకునేందుకు ముందుకు వచ్చారు.
జీవన్ దాన్ ట్రస్ట్ చొరవతో డాక్టర్ భూమిక ఆర్గాన్స్ డొనేట్ చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. దీంతో ఆమె లివర్, కిడ్నీలు, గుండె ఊపిరితిత్తులను ఐదుగురికి అమర్చేందుకు డాక్టర్లు నిర్ణయించారు. పుట్టెడు దుఖఃలోనూ ఔదార్యం చూపిస్తూ అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చిన డాక్టరమ్మ కుటుంబసభ్యులపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.