విషాదం.. చికిత్స చేస్తుండగా ఇద్దరికి ఒకేసారి గుండె పోటు.. రోగి, డాక్టర్‌ మృతి

Doctor and patient died with heart attack. కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తికి ఛాతీలో నొప్పి వచ్చింది. నొప్పి తీవ్రం కావడంతో అతడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రి తరలించారు.

By అంజి  Published on  28 Nov 2021 7:39 AM GMT
విషాదం.. చికిత్స చేస్తుండగా ఇద్దరికి ఒకేసారి గుండె పోటు.. రోగి, డాక్టర్‌ మృతి

తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తికి ఛాతీలో నొప్పి వచ్చింది. నొప్పి తీవ్రం కావడంతో అతడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రి తరలించారు. అయితే అతడిని చికిత్స అందిస్తుండగా వైద్యుడికి కూడా గుండెపోటు వచ్చింది. దీంతో రోగి, వైద్యుడు ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే.. గాంధారి మండలం గుజ్జల్‌ తండాకు చెందిన ఓ వ్యక్తికి గుండె పోటు వచ్చింది. దీంతో అతడిని కుటుంబ సభ్యులు వెంటనే గాంధారిలోని నర్సింగ్‌ హోమ్‌కు తరలించారు.

ఆస్పత్రిలో రోగికి చికిత్స చేస్తున్న సమయంలో వైద్యుడు డాక్టర్‌ లక్ష్మణ్‌కు గుండె పోటు వచ్చింది. దీంతో వైద్యుడు ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. అయితే వెంటనే రోగిని కుటుంబ సభ్యులు వేరే ఆస్పత్రి తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే కామారెడ్డిలోని మరో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో రోగి మృతి చెందాడు. ఇద్దరు మృతితో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story
Share it