టీఆర్ఎస్‌ రాజకీయ పార్టీ కాదు : డీఎస్ త‌న‌యుడి విమ‌ర్శ‌లు

Dharmapuri Sanjay Fire On TRS. పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డితో నేడు ఇత‌ర పార్టీ జిల్లాల ముఖ్య‌నేత‌లు భేటీ అయ్యారు.

By Medi Samrat  Published on  13 July 2021 8:52 AM GMT
టీఆర్ఎస్‌ రాజకీయ పార్టీ కాదు : డీఎస్ త‌న‌యుడి విమ‌ర్శ‌లు

పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డితో నేడు ఇత‌ర పార్టీ జిల్లాల ముఖ్య‌నేత‌లు భేటీ అయ్యారు. మాజీ కాంగ్రెస్ నేత ఢీ. శ్రీనివాస్ త‌న‌యుడు, నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎర్ర శేఖర్, భూపాలపల్లి సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కులు గండ్ర సత్యనారాయణలు రేవంత్‌ను క‌లిసిన వారిలో ఉన్నారు. వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నామ‌ని తెలిపారు. త్వరలో బహిరంగ సభలు పెట్టి పార్టీలో చేరుతామ‌ని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంద‌ని తాము విశ్వ‌సిస్తున్నామ‌ని అన్నారు.

ఈ సంద‌ర్భంగా ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయినందుకు మనస్ఫూర్తిగా అభినందించాన‌ని అన్నారు. కాంగ్రెస్ లో పుట్టి పెరిగాన‌ని.. కొన్ని కారణాల వల్ల పార్టీ వీడి వెళ్లాను. మా నాన్న కోసమే మధ్యలో టీఆర్ఎస్‌లో చేరాన‌ని.. టీఆర్ఎస్‌ కండువా ఒక గొడ్డలి లాంటిదని విమ‌ర్శించారు. టీఆర్ఎస్‌ రాజకీయ పార్టీ కాదని.. జిల్లా ప్రెసిడెంట్ కు గుర్తింపు లేదని అన్నారు. రేవంత్ నాయకత్వాన్ని బలపరచడం కోసం తిరిగి కాంగ్రెస్ కు వస్తున్నాన‌ని తెలిపారు. త్వరలో ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతాన‌ని అన్నారు. కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుందని అన్నారు. బీజేపీ నేత ఎర్ర శేఖర్ మాట్లాడుతూ.. బీజేపీ సభ్యత్వానికి, జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాన‌ని అన్నారు. త్వరలో కాంగ్రెస్ లో చేరుతున్నాన‌ని అన్నారు.


Next Story
Share it