ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్స్ చూసి బీజేపీ నేతలు సంకలు గుద్దుకుంటున్నారని.. రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం అని కిషన్ రెడ్డి, బండి సంజయ్ పగటి కలలు కంటున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇంకా పది ఏండ్లు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది.. లోకల్ బాడీ ఎన్నికల్లో రెండు, మూడు సీట్లు కూడా బీజేపీకి రావు అని అన్నారు. రాష్ట్రనికి రావాల్సిన నిధులను రాకుండా కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు అడ్డుపడుతున్నారని.. తెలంగాణకు నిధులు రాకుండా అడ్డుపడుతున్న ద్రోహులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లని ఆరోపించారు.
ఎమ్మెల్యే ఎన్నికలు మేము పెద్దగా పట్టించుకోట్లేదు అంటారు.. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచారన్నారు.. గతంలో ఏపీలో బీజేపీ 8 ఎమ్మెల్సీలు గెలిచారు.. ఏపీలో బీజేపీ అధికారంలోకి వచ్చిందా? అని ప్రశ్నించారు. 2018 ఎన్నికల్లో బీజేపీ 103 సీట్లలో డిపాజిట్ కోల్పోయిందన్నారు. 2023లో 68 స్ధానాలలో డిపాజిట్ రాలేదన్నారు. బీఆర్ఎస్ నేతల కేసులను కాపాడుతూ బీజేపీ లబ్ది పొందుతుందన్నారు.
బీఆర్ఎస్‌తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని బీజేపీ రెండు ఎమ్మెల్సీలు గెలిచిందని ఆరోపించారు. కాంగ్రెస్ చేస్తున్న మంచి పనులను తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఏరోజు బీజేపీ ఎంపీలు తెలంగాణ నిధుల గురించి మాట్లాడలేదన్నారు. తీన్మార్ మల్లన్న అన్ని అబద్దాలు మాట్లాడుతున్నారని.. పబ్లిసిటి కోసం లిక్కర్ డాన్ కవిత సీఎం రేవంత్ రెడ్డి పై మాట్లాడుతుందన్నారు.