ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ కేసులో అభిషేక్, విజయ్ నాయర్ లకు బెయిల్ మంజూరైంది. సీబీఐ ప్రత్యేక కోర్టు వారికిద్దరికీ బెయిల్ ఇచ్చింది. ఒక్కొక్కరికి రూ.2 లక్షల పూచీకత్తుపై బెయిల్ ఇస్తున్నట్లు చెప్పింది. ఈడీ కస్టడీకి తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది ప్రత్యేక కోర్టు. అభిషేక్, విజయ్ నాయర్ లకు 5 రోజుల ఈడీ కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించి విచారణ చేసేందుకు ఈడీ కస్టడీకి ఇచ్చింది న్యాయస్థానం. అయితే ఇద్దరు కుటుంబ సభ్యులు కలిసేందుకు అవకాశం ఇచ్చింది. తన తల్లిని కలిసేందుకు అభిషేక్ కు అవకాశం ఇచ్చింది న్యాయస్థానం. లిక్కర్ స్కాం కేసులో నిందితులుగా ఉన్న అభిషేక్, విజయ్ నాయర్ లను సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరెట్ అదుపులోకి తీసుకుంది. సీబీఐ అదుపులో వున్న వారిద్దరినీ అరెస్ట్ చేసింది. ఇదే కేసులో శరత్ చంద్రా రెడ్డి, వినయ్ బాబులను కూడా ఈడీ ఇప్పటికే అదుపులోకి తీసుకుంది.