ఢిల్లీ లిక్కర్ స్కాం కు సంబంధించిన కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో ఈ నెల 11న సీబీఐ సమావేశం కానుంది. ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో తన నివాసంలో అందుబాటులో ఉంటానని, అందులో అనువైన రోజున తనతో సమావేశం కావచ్చని సీబీఐకి కవిత లేఖ రాశారు. కవిత లేఖకు సీబీఐ స్పందిస్తూ ఈమెయిల్ ద్వారా సమాధానం ఇచ్చింది. 11వ తేదీన హైదరాబాద్ లోని కవిత నివాసంలో 11 గంటలకు భేటీ అవుతామని సీబీఐ తెలిపింది.
డిసెంబర్ 2న సీబీఐ నుండి నోటీసు అందుకున్న కవిత.. తన ముందస్తు షెడ్యూల్ కారణంగా డిసెంబర్ 6న విచారణకు హాజరుకాలేనని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కి లేఖ రాసింది. డిసెంబర్ 11, 12 లేదా డిసెంబర్ 14, 15 తేదీల్లో హైదరాబాద్‌లోని తన నివాసంలో విచారణ జరపవచ్చని ఆమె సీబీఐకి తెలియజేశారు. చట్టాన్ని తాను గౌరవిస్తానని, విచారణకు సహకరిస్తానని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. అలాగే ఢిల్లీ లిక్కర్ స్కాం ఎఫ్ఐఆర్‌లో నిందితుల జాబితాలో తన పేరు లేదని కవిత లేఖలో పేర్కొన్నారు.