అది అవాస్తవం.. దీపాదాస్ మున్షీ నిబద్ధత, క్రమశిక్షణ గల నాయకురాలు
దీపాదాస్ మున్షీ నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణ గల నాయకురాలు అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
By Medi Samrat
అది అవాస్తవం.. దీపాదాస్ మున్షీ నిబద్ధత, క్రమశిక్షణ గల నాయకురాలు
తెలంగాణ రాష్ట్ర ఏఐసీసీ ఇంచార్జ్ గా పని చేసిన దీపాదాస్ మున్షీ నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణ గల నాయకురాలు అని ఆమె పార్టీని బలోపేతం చేయడంలో ఎంతో కృషి చేశారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.తెలంగాణ రాష్ట్ర ఏఐసీసీ ఇంచార్జ్ గా పని చేసిన దీపాదాస్ మున్షీ నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణ గల నాయకురాలు అని ఆమె పార్టీని బలోపేతం చేయడంలో ఎంతో కృషి చేశారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కొన్ని దినపత్రికలు, ప్రసార మాద్యమాలలో దీపాదాస్ మున్షీ పార్టీ కార్యక్రమాలను నిర్లక్ష్యం చేసారని ప్రచారం చేస్తున్నారని ఇది అవాస్తవమని ఆయన అన్నారు.
దీపాదాస్ మున్షీ కేరళ ఏఐసీసీ ఇంచార్జ్ గా ఉంటూ తెలంగాణ లో ఏడాది కాలం పాటు అదనపు బాధ్యతలు నిర్వహించారని, ఏఐసీసీ కొన్ని రాష్ట్రాల ఇంచార్జ్ లను, సంస్థాగత మార్పులను చేస్తూ అందులో భాగంగా తెలంగాణ కు పూర్తి బాధ్యతలతో మీనాక్షి నటరాజన్ ను నియమించారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ కి కేరళలో పూర్తి బాధ్యతలతో పనిచేయాల్సి ఉన్నందున ఇక్కడ కొత్త నియామకం జరిగిందే తప్ప ఎలాంటి చర్యలు కావని అన్నారు. దీపాదాస్ మున్షీ ప్రియరంజన్ దాస్ ముంన్షి సతిమణిగా, పెద్ద రాజకీయ కుటుంబ నేపత్యం, నీతి, నిజాయితీగా పని చేసిన చరిత్ర ఉందని, పార్టీ ని క్రమశిక్షణగా, సంస్థాగతంగా బలోపేతం చేసారని అన్నారు . ఆమెపై వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నామని, అలాంటి నిరాదర వార్తలు రాస్తే చట్టపరమైన చర్యలు చేపడుతామని హెచ్చరించారు.