కనిపించకుండా పోయిన వంశీ కృష్ణ.. ట్యాంకులో మృతదేహం

తెలంగాణలోని నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని ఓ ప్రాంతంలో ప్రజలు గత కొన్ని రోజులుగా కలుషితమైన నీటిని తాగుతున్నారు.

By Medi Samrat  Published on  3 Jun 2024 6:54 PM IST
కనిపించకుండా పోయిన వంశీ కృష్ణ.. ట్యాంకులో మృతదేహం

తెలంగాణలోని నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని ఓ ప్రాంతంలో ప్రజలు గత కొన్ని రోజులుగా కలుషితమైన నీటిని తాగుతున్నారు. ట్యాంకులో మృతదేహం ఉందని తెలియడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. నల్గొండ మునిసిపాలిటీలోని హిందూపూర్ పాతబస్తీ ప్రాంతంలో (వార్డు నంబర్ 11) ఉన్న వాటర్ ట్యాంక్‌లో బాగా కుళ్లిపోయిన మృతదేహాన్ని జూన్ 3న గుర్తించారు. ఈరోజు నీటిని విడుదల చేసే ముందు పరిశుభ్రతకు సంబంధించి మున్సిపల్ ఏఈ, వాటర్ లైన్‌మెన్ తనిఖీ చేస్తున్న సమయంలో మృతదేహాన్ని కనుగొన్నారు.

ట్యాంక్‌ను చివరిసారిగా మే 30, జూన్ 1న తనిఖీ చేశారు. "ట్యాంక్‌ను 2-3 రోజులలో క్రమం తప్పకుండా శుభ్రం చేస్తారు. ప్రతి 3 రోజులకు స్క్రూంగింగ్‌తో క్రమం తప్పకుండా శుభ్రపరచడం జరుగుతుంది" అని అధికారులు తెలిపారు. తాగునీటి నుండి దుర్వాసన వస్తున్నట్లు నివాసితులు నివేదించడంతో తనిఖీలు నిర్వహించారు. మృతదేహం హనుమాన్‌ నగర్‌లో నివాసముంటున్న మానసిక వికలాంగుడైన ఆవుల వంశీకృష్ణ (27) అనే వ్యక్తిది. మే 24 నుంచి ఆ వ్యక్తి కనిపించకుండా పోయినట్లు సమాచారం. ఈ కేసును ఆత్మహత్య, హత్యకు సంబంధించి పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story